బాటసారి – Questions and Answers – Inter 1st Year Telugu

బాటసారి

Questions and Answers

ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం తెలుగు

కవి: శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)

Summary • Questions & Answers • Grammar • Special Points

1. కవి పరిచయం

ప్రస్తుత పాఠ్యభాగం ‘బాటసారి’ కవితను శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారిచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి నుండి గ్రహించబడినది.

“మానవుడే సందేశం – మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటి, ప్రాచీనకాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ – తెలుగు సాహితీ ప్రపంచంలో వీరు ముగ్గురే మహాకవులు అని తీర్మానించిన శ్రీశ్రీ ఏప్రిల్ 30, 1910న విశాఖపట్టణంలో జన్మించారు.

“వ్యక్తికి బహువచనం శక్తి” అని, 1940 తర్వాత తెలుగు కవిత్వాన్ని ఒక దశాబ్దం పాటు ఉర్రూతలూగించిన శ్రీశ్రీ ‘ప్రభవ’ అనే పద్యకావ్యం, ‘విశ్వరూప సందర్శనం’, ‘మహాప్రస్థానం’, ‘మరోప్రస్థానం’, ‘ఖడ్గసృష్టి’ మొదలైన కవితా సంపుటాలు రచించారు.

‘చరమరాత్రి’ అనే కథల సంపుటి, ‘అనంతం’ అనే పేరుతో స్వీయచరిత్రను రచించారు. వీరు సినీగేయ రచయితగానూ పనిచేశారు.

“నా ఇంటి పేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిద్దిగంతం
అభ్యుదయ సుగంధం”

అని కవితా బావుటా ఎగరేసిన శ్రీశ్రీ తన “మహాప్రస్థానాన్ని” అభ్యుదయ కవిత్వానికి ఆయువు పట్టుగా మలిచాడు.

శ్రీశ్రీ వ్రాసిన ఖడ్గసృష్టి కావ్యానికి 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో “సోవియట్ ల్యాండ్ నెహ్రూ” అవార్డు లభించాయి.

విశేషాంశం

కులీనుల ఇళ్ళలో బందీ అయిన తెలుగు కవిత్వం శ్రీశ్రీ చొరవతో స్వేచ్ఛావిహారం చేస్తూ సామాన్యుడిని అందలమెక్కించి, కావ్యగౌరవం కల్పించింది.

శ్రీశ్రీ తన గీతాన్ని జాతిజనులు పాడుకునే తారకమంత్రంగా మార్మోగాలని, తన కవిత్వానికి మానవుడే ‘మకుటధారి’ అని ఉద్ఘాటించాడు.

2. పాఠ్యభాగ ఉద్దేశ్యం

నిరుద్యోగ సమస్యను, దాని తాలూకా పర్యవసానాలను, అది వ్యక్తులపై, కుటుంబాలపై, సమాజంపై చూపిస్తున్న ప్రభావాన్ని విద్యార్థులకు తెలియజేసి, పరోక్షంగా చదువు విలువను గుర్తింపచేస్తూ జాగృతం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

3. పాఠ్యభాగం – వచన కవిత

కూటికోసం, కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని – తల్లిమాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి, మూడురోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక – నడి సముద్రపు నావ రీతిగ సంచరిస్తూ, సంచలిస్తూ, దిగులు పడుతూ, దీనుడౌతూ తిరుగుతుంటే- చండ చండం, తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే, భయం వేస్తే – ప్రలాపిస్తే మబ్బుపట్టీ, గాలికొట్టీ, వానవస్తే, వరదవస్తే, చిమ్మచీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ! కళ్ళు వాకిట నిలిపిచూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో ……..? చింతనిప్పులలాగు కన్నుల చెరిగిపోసే మంట లెత్తగ, గుండుసూదులు గ్రుచ్చినట్లే, శిరోవేదన అతిశయించగ, రాత్రి, నల్లని రాతి పోలిక గుండె మీదనె కూరుచుండగ, తల్లిపిల్చే కల్ల దృశ్యం కళ్ళ ముందట గంతులేయగ చెవులు సోకని పిలుపులేవో తలుచుకుంటూ, కలతకంటూ- తల్లడిల్లే, కెళ్ళగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం ! అతని బ్రతుకున కదే ఆఖరు ! గ్రుడ్డి చీకటిలోన గూబలు ఘూకరించాయి వానవెలిసీ మబ్బులో ఒక మెరుపు మెరిసింది; వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది; విడిన మబ్బుల నడుమనుండీ వేగుజుక్క వెక్కిరించింది; బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది ! పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది!

4. పాఠ్యభాగ సంగ్రహం

బ్రతుకు తెరువు కోసం ఒక బాటసారి తన తల్లి వద్దని వారించినా ఆమె మాటలు వినకుండా బాగా జీవించాలనే ఆశతో పట్టణానికి పయనవుతాడు.

ఇంటినుండి బయలుదేరిన బాటసారి మూడు రోజులు ఎక్కడా ఆగకుండా నడుస్తూ ఏ దారీ తెలియక, ఎక్కడ చేరాలో తెలియక నడిసముద్రంలో నావ రీతిగా బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు.

అతని బాధ తీవ్రమై జ్వరం వస్తే, భయం వస్తే, ఇవన్నీ తీవ్రరూపం దాలిస్తే, అలాగే ఆకాశం అంతా మబ్బు వ్యాపిస్తే, గాలి ఎక్కువైతే, వాన ఎక్కువ వస్తే, వరద వచ్చినట్లయితే, మొత్తం చీకటి ఆవరిస్తే, ఆ దారి తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టం! అని కవి ప్రశ్న.

పల్లెటూరులో బాటసారి తల్లి బయట నిల్చుని తన కొడుకు కోసం ఎదురుచూస్తూ ఏమని పలవరిస్తోందో!

బాటసారి కన్నులు ఎర్రని చింత నిప్పుల లాగా చెలరేగితే, ఆ కళ్ళల్లో గుండుసూదులు గుచ్చినట్లు తలనొప్పి విపరీతమై, ఆ రాత్రి అతని గుండె మీద పెద్ద బండ రాయి ఉన్నట్లు బరువై, అతని తల్లి పిల్చినట్లుగా దృశ్యం కళ్ళముందు గంతులేసింది.

ఏవేవో పిలుపులు పిలిచినా చెవులకు తాకలేదు. అవే తలచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఆ బాధ విపరీతమై బాటసారి చలించిపోయాడు.

బాటసారి బ్రతుకుకి అదే ఆఖరి రోజు. ఆ చిమ్మచీకటిలో గుడ్లగూబలు భయంకరంగా అరిచాయి. వాన వెలిసింది, మబ్బులో ఒక మెరుపు మెరిసింది. తెల్లవారిందని తెలియజేస్తూ కోడి కూసింది.

విడిన మబ్బుల మధ్య శీతవాయువు ఆ కళేబరంతో ఆడుకున్నది. పల్లెటూళ్ళో తల్లికి ఇదంతా తెలిసినట్లుగా పాడుకల వచ్చి తన కన్న పేగు కదిలింది.

కవిత సందేశం:

ఇలాంటి నిర్భాగ్యులు దేశంలో ఎంతోమంది ఉన్నారు. మానవవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. పనిచేయగలిగే వారందరికీ ఉపాధి చూపే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలి అనే సందేశాన్ని ఈ కవిత అందిస్తుంది.

5. I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. బాటసారి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.

పాఠ్యభాగ పరిచయం – ఉపోద్ఘాతం

బాటసారి పాఠ్యభాగం శ్రీశ్రీచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి నుండి గ్రహింపబడినది.

నిరుద్యోగ సమస్యను, దాని వలన ఏర్పడే పర్యవసానాలను విద్యార్థులకు తెలియజేస్తూ, చదువు ఆవశ్యకతను గుర్తింపజేస్తూ జాగృతం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

పాఠ్యభాగ విషయం

బ్రతుకు తెరువు కోసం ఒక బాటసారి తన తల్లి వద్దని వారించినా ఆమె మాటలు వినకుండా బాగా జీవించాలనే ఆశతో పట్టణానికి పయనవుతాడు.

ఇంటినుండి బయలుదేరిన బాటసారి మూడు రోజులు ఎక్కడా ఆగకుండా నడుస్తూ ఏ దారీ తెలియక, ఎక్కడ చేరాలో తెలియక నడిసముద్రంలో నావ రీతిగా బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు.

అతని బాధ తీవ్రమై జ్వరం వస్తే, భయం వస్తే, ఇవన్నీ తీవ్రరూపం దాలిస్తే, అలాగే ఆకాశం అంతా మబ్బు వ్యాపిస్తే, గాలి ఎక్కువైతే, వాన ఎక్కువ వస్తే, వరద వచ్చినట్లయితే, మొత్తం చీకటి ఆవరిస్తే, ఆ దారి తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టం! అని కవి ప్రశ్న.

పల్లెటూరులో బాటసారి తల్లి బయట నిల్చుని తన కొడుకు కోసం ఎదురుచూస్తూ ఏమని పలవరిస్తోందో!

బాటసారి కన్నులు ఎర్రని చింత నిప్పుల లాగా చెలరేగితే, ఆ కళ్ళల్లో గుండుసూదులు గుచ్చినట్లు తలనొప్పి విపరీతమై, ఆ రాత్రి అతని గుండె మీద పెద్ద బండ రాయి ఉన్నట్లు బరువై, అతని తల్లి పిల్చినట్లుగా దృశ్యం కళ్ళముందు గంతులేసింది.

ఏవేవో పిలుపులు పిలిచినా చెవులకు తాకలేదు. అవే తలచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఆ బాధ విపరీతమై బాటసారి చలించిపోయాడు.

బాటసారి బ్రతుకుకి అదే ఆఖరి రోజు. ఆ చిమ్మచీకటిలో గుడ్లగూబలు భయంకరంగా అరిచాయి. వాన వెలిసింది, మబ్బులో ఒక మెరుపు మెరిసింది. తెల్లవారిందని తెలియజేస్తూ కోడి కూసింది.

విడిన మబ్బుల మధ్య శీతవాయువు ఆ కళేబరంతో ఆడుకున్నది. పల్లెటూళ్ళో తల్లికి ఇదంతా తెలిసినట్లుగా పాడుకల వచ్చి తన కన్న పేగు కదిలింది.

ఇలాంటి నిర్భాగ్యులు దేశంలో ఎంతోమంది ఉన్నారు. మానవవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. పనిచేయగలిగే వారందరికీ ఉపాధి చూపే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలి అనే సందేశాన్ని ఈ కవిత అందిస్తుంది.

6. II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. శ్రీరంగం శ్రీనివాసరావు గురించి రాయండి.

ప్రస్తుత పాఠ్యభాగం ‘బాటసారి’ కవితను శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారిచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

“మానవుడే సందేశం – మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటి, ప్రాచీనకాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ – తెలుగు సాహితీ ప్రపంచంలో వీరు ముగ్గురే మహాకవులు అని తీర్మానించిన శ్రీశ్రీ ఏప్రిల్ 30, 1910న విశాఖపట్టణంలో జన్మించారు.

“వ్యక్తికి బహువచనం శక్తి” అని, 1940 తర్వాత తెలుగు కవిత్వాన్ని ఒక దశాబ్దం పాటు ఉర్రూతలూగించిన శ్రీశ్రీ ‘ప్రభవ’ అనే పద్యకావ్యం, ‘విశ్వరూప సందర్శనం’, ‘మహాప్రస్థానం’, ‘మరోప్రస్థానం’, ‘ఖడ్గసృష్టి’ మొదలైన కవితా సంపుటాలు రచించారు.

‘చరమరాత్రి’ అనే కథల సంపుటి, ‘అనంతం’ అనే పేరుతో స్వీయచరిత్రను రచించారు. వీరు సినీగేయ రచయితగానూ పనిచేశారు.

‘మహాప్రస్థానం’ను అభ్యుదయ కవిత్వానికి ఆయువు పట్టుగా మలిచారు. ‘ఖడ్గసృష్టి’ కావ్యానికి 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో ‘సోవియట్ ల్యాండ్ నెహ్రూ’ అవార్డు లభించాయి.

ప్రశ్న 2. బాటసారి వ్యధను వివరించండి.

తల్లి వద్దని చెబుతున్నా వినకుండా, బ్రతుకు తెరువు కోసం ఒక బాటసారి పట్టణానికి వెళ్ళాడు.

ఇంటి నుండి బయలుదేరిన బాటసారి మూడురోజుల పాటు ఎక్కడా ఆగకుండా నడుస్తూ, ఎటువెళ్ళాలో తెలియక ఆ పట్టణంలో దిక్కుతోచక నడిసముద్రంలో కొట్టుమిట్టాడే నావ తీరుగా పట్టణంలో తిరగసాగాడు.

అలసిపోయి ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణుకుతూ తీవ్రమైన జ్వరం, శిరోవేదన కలిగి అనారోగ్యానికి గురయ్యాడు.

బాటసారి కన్నులు ఎర్రని చింతనిప్పులలాగా చెలరేగి కళ్ళలో గుండుసూదులు గుచ్చినట్లు బాధపడ్డాడు. ఆ రాత్రి గుండె మీద పెద్దబండరాయి ఉన్నట్లుగా బాధనొందాడు.

అతని తల్లి పిలిచినట్లుగా దృశ్యం కళ్ళముందు గంతులేసింది. ఏవేవో పిలుపులు పిలిచినా చెవులకు తాకలేదు. అవే తలుచుకుంటూ బాటసారి వ్యధనొందాడు.

7. III. ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

క్రమం ప్రశ్న జవాబు
1 బాటసారి ఏ కవితా సంపుటి నుండి స్వీకరించబడింది? శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి.
2 బాటసారి కోసం పల్లెటూరిలో పలవరించింది ఎవరు? అతని తల్లి.
3 కూటి కోసం, కూలీ కోసం పట్టణం వెళ్ళింది ఎవరు? బాటసారి.
4 కోడి దేనిని తెలియజేస్తూ కూత కూసింది? తెల్లవారినదని తెలియజేస్తూ కోడి కూత కూసింది.
5 శ్రీశ్రీ రచనలకు వచ్చిన అవార్డులు ఏవి? 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు.
6 శ్రీశ్రీ రచించిన కథా సంపుటి ఏది? ‘చరమరాత్రి’.
7 శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరేమిటి? ‘అనంతం’.

8. IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

1. “దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం.”

కవి పరిచయం

ఈ వాక్యం శ్రీశ్రీచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటిలోని ‘బాటసారి’ పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం

ఉన్న ఊరుని, కన్నతల్లిని విడిచి ఉపాధికోసం పట్టణానికి వెడలిన బాటసారి వెతలను గురించి కవి వివరించుచున్న సందర్భంలోనిది ఈ వాక్యము.

భావం

ఉపాధికోసం పట్టణానికి వెళ్ళిన బాటసారి ఎండనక, వాననక, ఎటువెళ్ళాలో, ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితిలో ‘నా’ అనేవారు లేక దురవస్థలను అనుభవించాడని కవి శ్రీశ్రీ బాటసారి దుస్థితిని తెలిపెనని భావము.

2. “చెవులు సోకని పిలుపులేవో”

కవి పరిచయం

ఈ వాక్యం శ్రీశ్రీచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటిలోని ‘బాటసారి’ పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం

ఉన్న ఊరుని, కన్నతల్లిని విడిచి ఉపాధికోసం పట్టణానికి వెడలిన బాటసారి వెతలను గురించి కవి వివరించుచున్న సందర్భంలోనిది ఈ వాక్యము.

భావం

బాటసారి పట్టణంలో దిక్కుతోచక తిరిగి తిరిగి అనారోగ్యానికి గురై, ఊరిలో ఉన్న అతని తల్లి పిలిచినట్లుగా దృశ్యం కళ్ళముందు కదలాడగా, ఏవేవో పిలుపులు పిలిచినా చెవులకు తాకలేదు.

ఊరిలోని తల్లి, జ్ఞాపకాలు గుర్తువచ్చి తల్లడిల్లుతూ ‘బాటసారి’ విపరీతమైన బాధతో చలించిపోయాడని కవి తెలిపెనని భావము.

3. “పాడుకలలో పేగు కదిలింది”

కవి పరిచయం

ఈ వాక్యం శ్రీశ్రీచే రచించబడిన ‘మహాప్రస్థానం’ కవితా సంపుటిలోని ‘బాటసారి’ పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.

సందర్భం

బాటసారి తల్లిపడిన వేదనను గూర్చి కవి తెలిపిన సందర్భంలోనిదీ వాక్యము.

భావం

కూలికోసం, కూటికోసం పట్టణానికి వచ్చిన బాటసారి దిక్కుతోచక నడిసంద్రంలో నావ రీతిగా తిరిగి, చివరికి మృత్యుఒడికి చేరుకున్నాడు.

పల్లెటూళ్ళో తల్లికి ఇదంతా తెలిసినట్లుగా పాడుకల వచ్చింది. ఆమె కన్నపేగు కదిలింది. తల్లిమనసు తల్లడిల్లింది.

9. V. సంధులు

పదం విడదీయడం సంధి
పల్లెటూరు పల్లె + ఊరు టుగాగమ సంధి
గ్రుచ్చినట్లే గ్రుచ్చిన + అట్లే అత్వసంధి
టుగాగమ సంధి సూత్రం:

కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరమైనపుడు టుగాగమంబగు.

అత్వసంధి సూత్రం:

అత్తునకు అచ్చుపరమగునపుడు సంధి బహుళముగానగు. (లేదా) అత్తునకు సంధి బహుళము.

10. VI. సమాసాలు

సమాస పదం విగ్రహ వాక్యం సమాసం
తల్లిమాటలు తల్లి యొక్క మాటలు షష్ఠీ తత్పురుష సమాసము
శిరోవేదన శిరస్సు నందు వేదన సప్తమీ తత్పురుష సమాసము
నడిసముద్రం సముద్రం యొక్క నడిమి భాగం ప్రథమా తత్పురుష సమాసము
శీతవాయువు శీతలమైన వాయువు విశేషణపూర్వపద కర్మధారయ సమాసము
నల్లనిరాతి నల్లనైన రాతి విశేషణపూర్వపద కర్మధారయ సమాసము
చింతనిప్పులు ఎర్రని అగ్గిరవ్వలు రూపక సమాసము / అవధారణాపూర్వపద కర్మధారయ సమాసము
సాధారణ ఉద్దేశం:

చింతనిప్పులు – ఎర్రని నిప్పుకణికలు – విశేషణపూర్వపద కర్మధారయ సమాసము.

11. VII. కఠినపదాలకు అర్థాలు

కఠినపదం అర్థం
తల్లడిల్లు బాధపడు
కెళ్ళగిల్లు తలక్రిందులు కావటం
పల్లటిల్లు చలించు

12. VIII. విశేషాంశాలు

⭐ వేగుచుక్క

సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆగ్నేయ దిక్కున ప్రకాశించే శుక్రగ్రహాన్ని “వేగుచుక్క” అంటారు.

భూమికంటే ముందే సూర్యకాంతి పడటం వల్ల శుక్రుడు అలా వెలుగులీనుతూ కన్పిస్తాడు.

చీకటి తొలగి, కాసేపటికి తెల్లవారుతుందనే దానికి సూచనగా “వేగుచుక్క” ప్రజలకు సాక్షాత్కరిస్తుంది. దీనిని ప్రగతికి చిహ్నంగా భావిస్తారు.

⭐ శ్రీశ్రీ గురించి మరికొంత

శ్రీశ్రీ పేరు వింటే అభ్యుదయ విప్లవ కవితా ఖండికల పేర్లు గుర్తుకు వస్తాయి. శ్రీశ్రీలో సున్నితమైన హాస్య ధోరణి ఉంది.

తన సంభాషణలో శ్రీశ్రీ శ్లేషలను ప్రయోగించి హాస్యాన్ని జనింపజేసేవాడు.

ఒక సందర్భంలో వల్లం నరసింహారావు అనే అతను శ్రీశ్రీ దగ్గరికి వచ్చి “మీరు నా కోసం ఒక నాటికను రాసివ్వాలి” అని అన్నాడు.

అందుకు శ్రీశ్రీ “ఏనాటికైనా” రాసిస్తాను అని సమాధానం ఇచ్చాడు.

“ఏనాటికైనా” అంటే ఎప్పుడో ఒకప్పటికి అనే అర్థం కూడా వస్తుంది.

మరొక సందర్భంలో మొక్కపాటి నరసింహారావు గారు తనకు ఎదురైన శ్రీశ్రీని ఉద్దేశించి గ్రామానికి వెళుతున్నారా అనే అర్థంలో “ఊరికేనా?” అని ప్రశ్నించాడు.

అందుకు శ్రీశ్రీ “ఆ … ఊరికే” అని శ్లేషలో, ఏదో కాలక్షేపానికి అలాగా బయటికి వచ్చాను అని అన్నాడు.

⭐ రసం

మిత్రులారా! మీరేదైనా హాస్యాన్ని చదివినప్పుడు నవ్వుతారు. అలాగే కొన్ని కథలను చదివినప్పుడు బాధకు గురవుతారు. మరికొన్ని కథలను చదివినప్పుడు భయపడతారు.

ఈ భావాలకు కారణమేమిటో తెలుసా! కవులు వారు రాసే కథలలో సందర్భానుసారంగా పాఠకులను రసానుభూతులుగా చేస్తారు.

రసం అంటే ద్రవింప చేసేదని అర్థం. కావ్యం చదవడం ద్వారా మన మనోభావనలు ద్రవిస్తాయి. కావ్యానికి రసం ప్రధానం.

నవరసాలు

క్రమం రసం
1శృంగారం
2హాస్యం
3కరుణ
4రౌద్రం
5వీరం
6భయానకం
7బీభత్సం
8అద్భుతం
9శాంతం

శృంగార హాస్య కరుణాః రౌద్ర వీర భయానకాః !
బీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాః స్మృతాః !!

ప్రస్తుతం ‘బాటసారి’ అనే ఈ కవితా ఖండిక శోక జనకంగా ఉండడం చేత కరుణరసం అవుతుంది.

13. పరీక్షకు Quick Revision

కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
కవితా సంపుటి మహాప్రస్థానం
ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య
బాటసారి వెళ్లిన ప్రదేశం పట్టణం
బాటసారి కోసం ఎదురుచూసింది తల్లి
కథా సంపుటి చరమరాత్రి
స్వీయచరిత్ర అనంతం
ప్రసిద్ధ కావ్యం ఖడ్గసృష్టి
కోడి కూత తెల్లవారినదని తెలియజేసింది
ప్రధాన రసం కరుణరసం
పల్లెటూరు పల్లె + ఊరు
చరమరాత్రి కథా సంపుటి
అనంతం స్వీయచరిత్ర
వేగుచుక్క శుక్రగ్రహం
పాడుకలలో పేగు కదిలింది తల్లి మనోవేదన

14. అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు

1. బాటసారి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.

2. శ్రీరంగం శ్రీనివాసరావు గురించి రాయండి.

3. బాటసారి వ్యధను వివరించండి.

4. “దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం” సందర్భాన్ని వివరించండి.

5. “చెవులు సోకని పిలుపులేవో” భావాన్ని వివరించండి.

6. “పాడుకలలో పేగు కదిలింది” భావాన్ని వివరించండి.

7. పల్లెటూరు, గ్రుచ్చినట్లే పదాలకు సంధి వివరించండి.

8. తల్లిమాటలు, శిరోవేదన, నడిసముద్రం మొదలైన సమాసాలను వివరించండి.

9. బాటసారి కవితలో ప్రధాన రసం ఏది?

10. బాటసారి కవిత ద్వారా కవి అందించిన సందేశం ఏమిటి?

15. కవిత యొక్క ప్రధాన సందేశం

నిరుద్యోగం – ఉపాధి – మానవీయత

‘బాటసారి’ కవిత ద్వారా నిరుద్యోగ సమస్య వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో కవి తెలియజేశాడు.

ఉపాధి కోసం స్వగ్రామాన్ని, కన్నతల్లిని విడిచి పట్టణానికి వెళ్లిన బాటసారి ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను కవి హృదయవిదారకంగా చిత్రించాడు.

పనిచేయగలిగిన వారందరికీ ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించాలి.

బాటసారి – తెలుగు స్టడీ నోట్స్

Intermediate 1st Year Telugu

Questions & Answers • Summary • Grammar • Revision

ఆంధ్రుడను – Questions and Answers | Inter 1st Year Telugu

ఆంధ్రుడను

Questions and Answers • Summary • పద్యాలు • భావాలు • వ్యాకరణం

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు

కవి పరిచయం

“మధుర శ్రీనాథ”గా కీర్తింపబడిన గుర్రం జాషువా 1895 సెప్టెంబరు 28న పల్నాడు జిల్లా చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లింగమాంబ, వీరయ్య.

గుఱ్ఱం జాషువా సరళభావ వ్యక్తీకరణతో, సొగసైన పదప్రయోగంతో, చక్కని శిల్ప సౌందర్యంతో అభ్యాగుల జీవనాన్ని అక్షరీకరించి ఆధునిక తెలుగుసాహిత్యం పై తనదైన ముద్రవేశాడు.

వీరు ఫిరదౌసి, గబ్బిలం, స్వపకథ, కాందిశీకుడు, ముంతాజ్మహల్, నేతాజీ, బాపూజీ, ముసాఫిరులు, నాగార్జునసాగర్, ఖండకావ్యాలు మొదలైనవి రచించారు.

సమసమాజ స్థాపన, సమతాజీవనం, మానవత్వం, హేతువాదం, కరుణరసం వీరి కవితకు హేతువులు. మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఛీత్కారాలు ఎదురైనచోటే సత్కారాలు పొందాడు.

జాషువా దృష్టిలో సామాన్యులు, గొప్పవారు అన్నతేడా లేదు. సహృదయులు, స్నేహశీలురు అయిన వారెవరితోనైనా స్నేహం చేసేవారు.

ఆధునిక తెలుగు కవిత్వానికి ఒక ప్రత్యేక శైలిని అద్ది, వాడి వేడి అందించిన కవికోకిల, కళాప్రపూర్ణ బిరుదాంకితులయిన శ్రీ గుర్రం జాషువా 1971 జులై 24న సాహితీ వినీలాకాశంలో శాశ్వత తారలాగా మెరిసేందుకు గగనానికి చేరెను.

పాఠ్యభాగ సందర్భం

“ఆంధ్రుడను” అనే ప్రస్తుత పాఠ్యాంశాన్ని “జాషువా సర్వలభ్య రచనల సంకలనం” నుండి గ్రహించారు.

జాషువా జాతీయాభిమానానికి, ఆంధ్రాభిమానానికి ఇది ఒక మచ్చుతునక. ఇతిహాసమూర్తులను స్పృశిస్తూ, భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, మానవీయతను ప్రస్తావిస్తూ, ఆంధ్రవీరుల పరాక్రమాన్ని ప్రస్తుతిస్తూ ఆద్యంతమూ ఆహ్లాదపరుస్తూ విద్యార్థులలో స్ఫూర్తి నింపడమే ఈ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశ్యం.

పాఠ్యభాగ సారాంశం

వివిధదేశములలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన భరత ఖండము నాకు పాఠశాల. సాహిత్య సంగీతాలను స్తన యుగళంగా కలిగిన భాషాధిదేవత సరస్వతీ మాత నాకు గురువు.

సాందీపని మహర్షి సమక్షంలో విద్య గడించిన శ్రీకృష్ణుడు నా సహచర పాఠకుడు. భక్తి వైరాగ్యములను బోధించు భాగవతము నాకు బాలశిక్ష.

చేతిలో ఘంటమును ధరించి ముచ్చటైన అక్షరములతో దశదిశలనెడి ఫలకం మీద దేశపు గొప్పతనాన్ని దిద్దుకునే ఆంధ్ర పుత్రుడను నేను.

అష్టాదశ పురాణకర్త వ్యాసమహర్షి మా ఆస్థాన పండితుడు. శివధనస్సు విరిచిన గొప్ప వీరుడు సీతాదేవి భర్త శ్రీరామచంద్రుడు మా పొరుగువాడు.

ముల్లోకాలలోన విజయాలు సాధించిన భీమసేనుడు మా ఊరి వ్యాయామవీరుడు. గానవైదుష్యంతో రాళ్లను కరగజేయు భక్తుడు త్యాగరాజు మా ఇంట గాయకుడు.

హిమాలయ పర్వత శిఖరం పైకి ఎక్కి దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా పఠించే ఆంధ్ర వీరుడను నేను.

మా శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయుటకు తాజ్మహల్ను ఉదాహరణగా చూపిస్తాను. మా కవితా మాధుర్యాన్ని ఆస్వాదింపజేయుటకు తిక్కన కావ్యాలను ముందుంచుతాను.

ధనుర్విద్యా పాటవాన్ని చాటడానికి మహావీరుడైన అర్జునుడి పేరు చెబుతాను. మా దేశ పతివ్రతల ఘనత చాటడానికి సావిత్రి చరితను పఠిస్తాను.

భరతమాత ఆశ్చర్యపడే విధంగా ఆకాశమంతా మార్మోగుతుండగా మా ఘనత ఇదీ అని చాటుతున్న మాట తప్పని ఆంధ్ర భూపతిని నేను.

అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయా గుణానికి అద్దాలమేడ లాంటిది నా చిత్తము. నిరుపేదలకు బంగారు గుప్పిటలో దానం చేయగలది నా చెయ్యి.

అనాథలను చూసి కన్నీరు కార్చు కరుణకు పుట్టినిల్లు నా గుండె. అందమైన అలంకారముతో తేనెను పొంగించగల కవితను పలుకుటకు కల్పతరువు వంటిది నా నాలుక.

సంతోషము అనెడి విమానమునెక్కి కీర్తి అనెడి మేఘముల మీద ఏ కష్టం తెలియకుండా పగలు రాత్రి హాయిగా సంచరించే ఐశ్వర్యవంతుడును నేను.

శ్రీకృష్ణదేవరాయల మహోగ్ర ప్రతాపము మాకు దీపకళిక. రాజరాజ నరేంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు మాకు పండు వెన్నెలలు.

భుజబలం కలిగిన బొబ్బిలి వీరుల పరాక్రమము మాకు సహజ రక్షణ కవచము. శత్రు రాజుల శిరస్సులకు అంటిన పరాభవము అనే పంకము మాకు సౌందర్యాన్ని కలిగించే చుక్క బొట్టు.

ఘనమైన గ్రంథములను రచించి, ఆకాశమార్గంలో వలపుటంగడులను పెట్టి సిద్ధ సాధ్యాంగనలతో వ్యాపారం చేయగలిగిన ఆంధ్రవర్తకుడను నేను.

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. “ఆంధ్రుడను” పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.

“ఆంధ్రుడను” పాఠ్యభాగం గుఱ్ఱం జాషువాచే రచించబడిన “జాషువా సర్వలభ్య రచనల సంకలనం” నుండి గ్రహించబడినది.

జాషువా జాతీయాభిమానానికి, ఆంధ్రాభిమానానికి ఈ కావ్యం ఒక నిదర్శనం. ఈ కావ్యమునందు జాషువా భారతీయ ఇతిహాసమూర్తులను, శిల్పకళానైపుణ్యాన్ని, మానవీయతను, ఆంధ్రవీరుల పరాక్రమాలను స్పృశిస్తూ, ప్రశంశిస్తూ ప్రస్తావించిన తీరు ఆద్యంతము పాఠకులను ఆహ్లాదపరుస్తుంది.

జాషువా “ఆంధ్రుడను” కావ్యంలో భరతఖండమే తనకు పాఠశాల అని, భాషాధిదేవత సరస్వతీ మాత తనకు గురువు అని, శ్రీకృష్ణుడు తన సహచర పాఠకుడు అని, భక్తివైరాగ్యములను బోధించే భాగవత గ్రంథము తనకు పెద్దబాలశిక్ష గ్రంథము వంటిదని ఉద్ఘాటించారు.

అంతేకాదు అష్టాదశపురాణకర్త వ్యాసమహర్షి, శివధనుస్సును విరిచిన గొప్పవీరుడు, సీతాదేవి భర్తయగు శ్రీరామచంద్రుని, ముల్లోకాలలో విజయాలు సాధించిన భీమసేనుడు, గానవైదుష్యంతో రాళ్ళను కరగజేసే భక్తుడు త్యాగరాజు మొదలగువారి కీర్తిప్రతిష్ఠలను ఆంధ్రవీరుడైన తాను హిమాలయ పర్వత శిఖరం పైకెక్కి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా పద్యరచన గావించెదనని, పద్యాలను గొప్పగా పఠించెదనని కవి భారతదేశ సనాతన మూలాలను తన పద్యాలందు ప్రస్తుతించెను.

జాషువా కవి భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేయుటకు తాజ్మహల్ను నిదర్శనంగా చూపిస్తానన్నారు. కవితామాధుర్యం తెలుపుటకు తిక్కన కావ్యాలను, ధనుర్విద్యా నైపుణ్యం తెలుపుటకు అర్జునుడిని, భారతీయ పతివ్రతల ఔన్నత్యాన్ని తెలిపేందుకు సావిత్రి చరితను పఠిస్తానని పేర్కొన్నారు.

అహింస, దయాగుణం, దానగుణం, కవితాపఠిమ మొదలగు లక్షణాలు తన అభిమతమని కవి పేర్కొన్నారు.

శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజనరేంద్రుడు, బొబ్బిలివీరులు మొదలగు వీరపరాక్రమవంతులైన రాచరికాలు భరతభూమికి సహజరక్షణ కవచమని కవి తెలిపెను.

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. విత్తవంతుడను నేను అని జాషువ తెలిపిన విధం ఎలాంటిది?
జాషువా తన మనసు అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయాగుణానికి అద్దాలమేడలాంటిదని పేర్కొనెను. తన చెయ్యి నిరుపేదలకు దానం చేయగలిగే బంగారు గుప్పిటను కలిగినదని, తన గుండె అనాథలను చూసి కన్నీరు కార్చే కరుణకు పుట్టినిల్లు అనీ, తన నాలుక అందమైన కవిత్వానికి ఆలవాలమని తెలిపెను. కావున సంతోషమనే విమానం ఎక్కి కీర్తి అనే మేఘాలమీద ఏ కష్టం తెలియకుండా పగలు, రాత్రి హాయిగా సంచరించే “విత్తవంతుడను” అనగా ఐశ్వర్యం కలవాడినని తెలిపెను. అనగా సమాజం పట్ల, సాటిమనుషుల పట్ల బాధ్యతగల నిస్వార్థపరుడైన విత్తవంతుడని గ్రహించవచ్చును.
ప్రశ్న 2. జాషువా హిమాలయ శిఖరమెక్కి గానం చేస్తానని చెప్పిన విషయాలేవి?
అష్టాదశ పురాణకర్త వ్యాసమహర్షి పాండిత్యాన్ని, శివధనుస్సును విరిచిన సీతాదేవి భర్త శ్రీరామచంద్రుని వీరత్వాన్ని, భీమసేనుని శక్తిసామర్థ్యాలను, త్యాగరాజు గానవైదుష్యం మొదలగు విషయములను జాషువా హిమాలయ శిఖరం ఎక్కి గానం చేస్తానని పలికెను.
ప్రశ్న 3. జాషువా రచనలను తెలియజేయండి.
ఫిరదౌసి, గబ్బిలం, స్వప్నకథ, ముంతాజ్మహల్, నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, కాందిశీకుడు, కాందిశీకులు, నాగార్జునసాగర్, ఖండకావ్యాలు మొదలగునవి జాషువా ప్రసిద్ధ రచనలు. వీరి “క్రీస్తు చరిత్ర” కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

III. ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న జవాబు
1. భక్తి వైరాగ్యాలకు నిలయమైన గ్రంథం ఏది? భక్తి వైరాగ్యాలకు నిలయమైన గ్రంథం ‘గబ్బిలం’.
2. గాండీవి అని ఎవరిని అంటారు? గాండీవి అని అర్జునుడిని అంటారు.
3. మన ఆస్థాన పండితునిగా జాషువా ఎవరిని పేర్కొన్నారు? మన ఆస్థాన పండితునిగా జాషువా అష్టాదశ పురాణకర్త వ్యాసమహర్షిని పేర్కొన్నారు.
4. జాషువా ఎప్పుడు జన్మించారు? గుఱ్ఱం జాషువా 1895 సెప్టెంబరు 28న పల్నాడు జిల్లా చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించారు.
5. జాషువా బిరుదులేవి? జాషువా బిరుదులు – కవికోకిల, కళాప్రపూర్ణ.
6. శిల్ప నైపుణ్య మహిమను ఉదాహరించడానికి కవి పేర్కొన్న నిర్మాణమేది? శిల్ప నైపుణ్య మహిమను ఉదాహరించడానికి కవి ‘తాజ్మహల్’ నిర్మాణాన్ని పేర్కొనెను.
7. శీల సంపదకు ప్రతీకగా కవి ఎవరిని పేర్కొన్నారు? శీల సంపదకు ప్రతీకగా కవి “సావిత్రి చరిత్రను” పేర్కొనెను.
8. తన గాన నైపుణ్యంతో రాళ్ళను సైతం కరిగించిన భక్తుడెవరు? తన గాన నైపుణ్యంతో రాళ్ళను సైతం కరిగించిన భక్తుడు “త్యాగరాజు”.

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. “మడమ ద్రిప్పని యాంధ్రవీరుడను నేను”

కవి పరిచయం: ఈ వాక్యం గుఱ్ఱం జాషువాచే రచించబడిన ‘ఆంధ్రుడను’ పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం: ఇతిహాసమూర్తులను స్పృశిస్తూ, భారతీయ ఔన్నత్యాన్ని గురించి కవి వర్ణించిన సందర్భంలోనిది ఈ వాక్యము.

భావము: ఆస్థాన పండితునిగా భావించే వ్యాసమహర్షి యొక్క, వీరుడైన శ్రీరామచంద్రుని యొక్క, పాండవ మధ్యముడు, బలపరాక్రమవంతుడైన భీమసేనుని యొక్క, గానవైదుష్యంతో రాళ్ళను కరగజేసే భక్తుడు త్యాగరాజు యొక్క కీర్తి ప్రతిష్ఠలను హిమాలయ పర్వత శిఖరంపై కెక్కి ప్రపంచానికి చాటే “ఆంధ్రవీరుడను నేను” అని కవి పలికెనని భావము.

2. “కరుణకు నా గుండె పురిటి గీము”

కవి పరిచయం: ఈ వాక్యం గుఱ్ఱం జాషువాచే రచించబడిన ‘ఆంధ్రుడను’ పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం: తన యొక్క అభ్యుదయవాదాన్ని గూర్చి కవి వర్ణించిన సందర్భంలోనిది ఈ వాక్యము.

భావము: అహింస, దయాగుణం, అనాథలను చూసి కన్నీరు కార్చు కరుణకు పుట్టినిల్లు తన గుండె అని, అనగా కవి తాను దయార్ద్రహృదయం కలవాడనని జాషువా కవి పలికెనని భావము.

3. “సమగ్ర ప్రతాపము దీపకళిక మాకు”

కవి పరిచయం: ఈ వాక్యం గుఱ్ఱం జాషువాచే రచించబడిన ‘ఆంధ్రుడను’ పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.

సందర్భం: ఆంధ్రదేశమును పాలించిన గొప్పదనాన్ని గూర్చి కవి వర్ణించిన సందర్భంలోనిది ఈ వాక్యము.

భావం: శ్రీకృష్ణదేవరాయల మహోగ్రప్రతాపము, ఆంధ్రులకు దీపకళిక వంటిదని కవి పలికెనని భావము.

V. సంధులు

క్రమం పదం విడదీత సంధి సూత్రం
1 మోహనాక్షరములు మోహన + అక్షరములు సవర్ణదీర్ఘసంధి అ, ఇ, ఉ, ఋలకు సవర్ణమైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
2 దేవర్షి దేవ + ఋషి గుణసంధి అకారానికి ఇ, ఉ, ఋలు పరమగునపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.
3 నరేంద్ర నర + ఇంద్ర గుణసంధి అకారానికి ఇ, ఉ, ఋలు పరమగునపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.
4 సాధ్యాంగనలు సాధ్య + అంగనలు సవర్ణదీర్ఘసంధి అ, ఇ, ఉ, ఋలకు సవర్ణమైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
5 పందెమొద పందెము + ఒడ్డెద ఉత్వసంధి ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధి నిత్యము.
6 మంజులాలంకార మంజుల + అలంకార సవర్ణదీర్ఘసంధి అ, ఇ, ఉ, ఋలకు సవర్ణమైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
7 మాయిల్లు మా + ఇల్లు యడాగమసంధి సంధిలేని చోట సర్వంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
8 మహోన్నత మహా + ఉన్నత గుణసంధి అకారానికి ఇ, ఉ, ఋలు పరమగునపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.
9 మాయూరు మా + ఊరు యడాగమసంధి సంధిలేని చోట సర్వంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
10 వలపుటంగడి వలపు + అంగడి టుగాగమసంధి కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైనపుడు ‘ట్’ ఆగమంగా వస్తుంది.
గమనిక: మూల నోట్స్‌లో “పల్లెటూరు” అనే పదం కూడా సంధుల శీర్షిక కింద ప్రస్తావించబడింది.

VI. సమాసాలు

పదం విగ్రహవాక్యం సమాసం
కీర్తి మేఘములు కీర్తి అనెడి మేఘములు రూపక సమాసం / అవధారణాపూర్వపద కర్మధారయ సమాసం
భక్తి వైరాగ్యములు భక్తి మరియు వైరాగ్యములు ద్వంద్వసమాసం
ముల్లోకములు మూడు సంఖ్యగల లోకములు ద్విగు సమాసం
అద్దాలమేడ అద్దాలతో మేడ తృతీయతత్పురుష సమాసము
ధనుర్విద్యారమ ధనుర్విద్యయందు నైపుణ్యం కలవాడు బహువ్రీహి సమాసం
శీతనగము శీతలమైన నగము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సిద్ధసాధ్యులు సిద్ధిచేత సాధ్యులు తృతీయా తత్పురుష సమాసము
భాషావధూటి భాషనందు అవధూటి సప్తమీతత్పురుష సమాసం
అహింస హింస కానిది నఞ్ తత్పురుష సమాసం
భరతఖండము ‘భరత’ అను పేరుగల ఖండము సంభావనాపూర్వపద కర్మధారయ సమాసము

VII. కఠిన పదాలకు అర్థాలు

వధూటి
కన్య
తాలము
స్థానము
గడన
సంపాదన
ఈవి
దానము

VIII. విశేషాంశాలు

త్యాగరాజస్వామి

“గాన వైదుషి తాలుగరగు భక్తుడు త్యాగరాయండు” అనే పాదంలో రాళ్లను సైతం కరిగించేంత గాన మాధుర్యం కలిగిన వాడు త్యాగరాజస్వామి అని ఉంది.

ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగయ్య ముగ్గురినీ “కర్ణాటక సంగీత త్రయం”గా వ్యవహరిస్తారు. వీరు తంజావూర్ రాజ్యంలోని తిరువాయూరు ప్రాంతానికి చెందిన వారు.

త్యాగరాజస్వామి పూర్వీకులది ప్రకాశం జిల్లా కంభం దగ్గర ఉన్న కాకర్ల ప్రాంతం. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం తమిళనాడులోని తిరువాయూరులో అంగరంగ వైభవంగా జరుగుతాయి.

“ఎందరో మహానుభావులు, నిధి చాల సుఖమా, జగదానందకారకా” మొదలైనవి వీరు రచించిన కీర్తనలలో ప్రసిద్ధమైనవి. వీరు స్వరార్ణవం అనే సంగీతశాస్త్ర గ్రంథాన్ని రచించారు.

జాషువా చమత్కృతి

గుర్రం జాషువా, దీపాల పిచ్చయ్య శాస్త్రి ఇద్దరూ మంచి స్నేహితులు. మొదట్లో కొన్నాళ్ల పాటు జంట కవిత్వం చెప్పారు.

జంట కవులను ఒకే పేరుతో పిలవడం ఆనవాయితీ. ఉదాహరణకు దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిని కలిపి ‘తిరుపతి వేంకట కవులు’ అంటారు.

జాషువా, పిచ్చయ్య శాస్త్రి రెండు పేర్లను కలపడానికి ప్రయత్నిస్తే జాషువా పిచ్చి లేదా పిచ్చి జాషువా అని పిలవవలసి వస్తుందని ఆయన ఒంటరిగానే కవిత్వం చెప్పారు.

నాపేరు ముందుబెట్టిన
పాపంబదియేమొ జాషువా పిచ్చియగున్
నా పేరు వెనుకబెట్టిన
శాపంబిడినట్లు పిచ్చి జాష్వాలయ్యెన్.

పాఠ్యభాగం పద్యాలు – భావాలు

1. పద్యం

బహుదేశములను బేర్వడసి మీసము దీటు భరతఖండంబు నా పాఠశాల స్తనయుగంబున గానసాహిత్యములు గల్గు భాషావధూటి నా పంతులమ్మ సాందీపని సమక్షమందు విద్యగడించు వనమాలి నా సహపాఠకుండు భక్తివైరాగ్యముల తావలమైన భాగవతంబు నా బాలశిక్ష గంటము ధరించి మోహనాక్షరము లెనయ బ్రతిఫలించెడు నా మహోన్నత విభూతి వ్రాసికొందును దశదిశాఫలకపంక్తి గడనకెక్కిన యాంధ్రపుత్రుడను నేను
భావము: వివిధదేశములలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన భరత ఖండము నాకు పాఠశాల. సాహిత్య సంగీతాలను స్తన యుగళంగా కలిగిన భాషాధిదేవత సరస్వతీ మాత నాకు గురువు. సాందీపని మహర్షి సమక్షంలో విద్య గడించిన శ్రీకృష్ణుడు నా సహచర పాఠకుడు. భక్తి వైరాగ్యములను బోధించు భాగవతము నాకు బాలశిక్ష. చేతిలో ఘంటమును ధరించి ముచ్చటైన అక్షరములతో దశదిశలనెడి ఫలకం మీద దేశపు గొప్పతనాన్ని దిద్దుకునే ఆంధ్ర పుత్రుడను నేను.

2. పద్యం

ఘనపురాణ గ్రంథకర్త దేవర్షి వ్యా సుండు మా యాస్థాన పండితుండు శివధనుఃఖండనాంచిత బాహువీరుండు భూసుతాభర్త మా పొరుగువాడు ముల్లోక విజయంబు పుంజీభవించిన భీముండు మాయూరి సాముకాడు గానవైదుషి తాలుగరగు భక్తుడు త్యాగ రాయండు మాయింటి గాయకుండు శీతనగశృంగసీమ నాసీనుడనయి యద్భుతములైన బిరుదుపద్యములు సదివి వేడ్క మ్రోయించుకొందును విజయభేరి మడమ ద్రిప్పని యాంధ్రవీరుడను నేను
భావము: అష్టాదశ పురాణకర్త వ్యాసమహర్షి మా ఆస్థాన పండితుడు. శివధనస్సు విరిచిన గొప్ప వీరుడు సీతాదేవి భర్త శ్రీరామచంద్రుడు మా పొరుగువాడు. ముల్లోకాలలోన విజయాలు సాధించిన భీమసేనుడు మా ఊరి వ్యాయామవీరుడు. గానవైదుష్యంతో రాళ్లను కరగజేయు భక్తుడు త్యాగరాజు మా ఇంట గాయకుడు. హిమాలయ పర్వతశిఖరం పైకి ఎక్కి దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి తెలియజేసే విధంగా పద్యాలను గొప్పగా పఠించే ఆంధ్ర వీరుడను నేను.

3. పద్యం

మా శిల్పనైపుణ్య మహిమంబు ఘోషించు తాజమహాలు నుదాహరించి మా కవిత్వవిలాస మార్ధవంబుం జిందు ఘను తిక్కనకవిని మచ్చునకుజూపి మా ధనుర్విద్యారమా వైఖరింజాటు వీరుడౌ గాండీవి పేరు చెప్పి మా సతీశీలసంపద లచ్చుగ్రుద్దించు సావిత్రి మాంగల్య చరితమెన్ని భరతమాతకు గగ్గురుపాటు దోప గగనమండలి మార్మోయ గంఠమెత్తి పందెమొద విశ్వప్రపంచమందు నుడువుదప్పని యాంధ్రభూపుడను నేను
భావము: మా శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయుటకు తాజ్మహల్ను ఉదాహరణగా చూపిస్తాను. మా కవితా మాధుర్యాన్ని ఆస్వాదింపజేయుటకు తిక్కన కావ్యాలను ముందుంచుతాను. ధనుర్విద్యా పాటవాన్ని చాటడానికి మహావీరుడైన అర్జునుడి పేరు చెబుతాను. మా దేశ పతివ్రతల ఘనత చాటడానికి సావిత్రి చరితను పఠిస్తాను. భరతమాత ఆశ్చర్యపడే విధంగా ఆకాశమంతా మార్మోగుతుండగా మా ఘనత ఇదీ అని చాటుతున్న మాట తప్పని ఆంధ్ర భూపతిని నేను.

4. పద్యం

సర్వభూముల కహింసా సూక్తి బోధించు దయకు నాచిత్త మద్దాలమేడ గండుపేదలకు బంగారు గుప్పిట దన్ను నీవికి నా చేయి తావలంబు అత్యనాథుల గాంచి శ్రూదకము జిమ్ము కరుణకు నా గుండె పురిటి గీము మంజులాలంకార మకరంద ముప్పొంగు కవితకు నాజిహ్వ కల్పతరువు కమ్ముకొని వచ్చు కీర్తిమేఘముల మీద నమల సంతోషరస విమానముల నెక్కి హాయిగా సంచరింతు నహర్నిశంబు నిడుమలందని విత్తవంతుడను నేను
భావము: అన్ని దేశాలకు అహింసా సూక్తులను బోధించగలది, దయా గుణానికి అద్దాలమేడ లాంటిది నా చిత్తము. నిరుపేదలకు బంగారు గుప్పిటలో దానం చేయగలది నా చెయ్యి. అనాథలను చూసి కన్నీరు కార్చు కరుణకు పుట్టినిల్లు నా గుండె. అందమైన అలంకారములతో తేనెను పొంగించగల కవితను పలుకుటకు కల్పతరువు వంటిది నా నాలుక. సంతోషము అనెడి విమానమునెక్కి కీర్తి అనెడి మేఘముల మీద ఏ కష్టం తెలియకుండా పగలు రాత్రి హాయిగా సంచరించే ఐశ్వర్యవంతుడును నేను.

5. పద్యం

శ్రీకృష్ణరాయ ధాత్రీనాయకుని సమ గ్ర ప్రతాపము దీపకళిక మాకు రాజరాజనరేంద్ర రమణీయ సద్యశః కాండంబు పండురేయెండ మాకు మన్నెబొబ్బిలి దండిమగల దోస్సారంబు సహజ నిష్ఠుర కవచంబు మాకు అరిరాజమూర్ధన్య పరిభావపంకంబు మురువుమీతెడు చుక్కబొట్టు మాకు విలసితములైన యుద్ధంథములు రచించి యుడుపథంబున వలపుటంగడులు దీర్చి. అమ్ముకొందును సిద్ధసాధ్యాంగనలకు రాణజెలువారు నాంధ్రవర్తకుడ నేను
భావము: శ్రీకృష్ణదేవరాయల మహోగ్ర ప్రతాపము మాకు దీపకళిక. రాజరాజ నరేంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు మాకు పండు వెన్నెలలు. భుజబలం కలిగిన బొబ్బిలి వీరుల పరాక్రమము మాకు సహజ రక్షణ కవచము. శత్రు రాజుల శీరస్సులకు అంటిన పరాభవము అనే పంకము (బురద) మాకు సౌందర్యాన్ని కలిగించే చుక్క బొట్టు. ఘనమైన గ్రంథములను రచించి, ఆకాశమార్గంలో వలపుటంగడులను పెట్టి సిద్ధ సాధ్యాంగనలతో వ్యాపారం చేయగలిగిన ఆంధ్రవర్తకుడను నేను.

త్వరిత పునశ్చరణ – Quick Revision

కవి
గుర్రం జాషువా
జననం
1895 సెప్టెంబరు 28
జన్మస్థలం
చాట్రగడ్డపాడు
బిరుదులు
కవికోకిల, కళాప్రపూర్ణ
పాఠ్యాంశం
ఆంధ్రుడను
ఆస్థాన పండితుడు
వ్యాసమహర్షి
పొరుగువాడు
శ్రీరామచంద్రుడు
వ్యాయామవీరుడు
భీమసేనుడు
ఇంటి గాయకుడు
త్యాగరాజు
శిల్పకళకు ఉదాహరణ
తాజ్మహల్
కవితా మాధుర్యానికి
తిక్కన
ధనుర్విద్యకు
అర్జునుడు
శీలసంపదకు
సావిత్రి
కర్ణాటక సంగీత త్రయం
ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగరాజు

పరీక్షకు ముఖ్యమైన ప్రశ్నలు

  1. “ఆంధ్రుడను” పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి.
  2. విత్తవంతుడను నేను అని జాషువ తెలిపిన విధం ఎలాంటిది?
  3. జాషువా హిమాలయ శిఖరమెక్కి గానం చేస్తానని చెప్పిన విషయాలేవి?
  4. జాషువా రచనలను తెలియజేయండి.
  5. జాషువా ఎప్పుడు జన్మించారు?
  6. జాషువా బిరుదులేవి?
  7. శిల్ప నైపుణ్య మహిమకు కవి పేర్కొన్న నిర్మాణమేది?
  8. శీల సంపదకు ప్రతీకగా కవి ఎవరిని పేర్కొన్నారు?
  9. త్యాగరాజు గురించి వివరించండి.
  10. సంధులను ఉదాహరణలతో వివరించండి.
  11. సమాసాలను విగ్రహవాక్యాలతో రాయండి.
  12. పద్యాలకు భావాలు రాయండి.

ఆంధ్రుడను – Inter 1st Year Telugu

Questions • Answers • Summary • Grammar • పద్యాలు • భావాలు

జానపద కళలు – Questions and Answers | Inter 1st Year Telugu

జానపద కళలు

Questions and Answers • Summary • జానపద కళారూపాలు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు

రచయిత పరిచయం

తెలుగు రంగస్థల మరియు చలనచిత్ర నటులు, రచయిత, పరిశోధకులు, స్వాతంత్ర్య సమరయోధులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 07-07-1916వ తేదీన సౌభాగ్యమ్మ, వెంకయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను వరసగా కృష్ణాజిల్లాలోని కోలవెన్నులోనూ, పునాదిపాడులోనూ అభ్యసించారు.

మిక్కిలినేని జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని ఐదు సార్లు జైలుశిక్ష అనుభవించారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

దీనిద్వారా బుర్రకథ, హరికథ, జముకుల కథ, వీధినాటకం, కోలాటం, బృంద నృత్యం మొదలైన కళారూప ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

రచనలు: ఆంధ్ర నాటక రంగ చరిత్ర, నటరత్నాలు, తెలుగువారి జానపద కళారూపాలు, ప్రజాపోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్యకళా వికాసం, తెలుగువారి చలనచిత్రకళ మొదలైనవి.

“నటరత్నాలు” గ్రంథానికి ఆంధ్రదేశ సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

నాటకరంగానికి, జానపద కళలకు కృషి చేసినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి “కళాప్రపూర్ణ” అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘తెలుగు వెలుగు’ అవార్డును, సంగీత నాటక అకాడమి ‘కళాప్రవీణ’ బిరుదును స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి సభ్యులుగానూ, మద్రాస్ సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్లో బొమ్మల విభాగంలో సలహాదారుగానూ పనిచేశారు.

సినిమా రంగంలో ఉండి నాటకరంగం కోసం, కళారూపాల ఉద్ధరణ కోసం నిస్వార్థంగా పాటుపడిన ఆదర్శ కళాకారుడు మిక్కిలినేని. దేశం నాకేమిచ్చిందని కాక దేశానికి నేనేమిచ్చాననే స్ఫూర్తితో పనిచేసిన మిక్కిలినేని 22-02-2011న కన్నుమూశారు.

పాఠ్యభాగ పరిచయం & ఉద్దేశం

‘జానపద కళలు’ పాఠ్యభాగం తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన “తెలుగువారి జానపద కళారూపాలు” అనే గ్రంథం నుండి గ్రహించబడినది.

జానపద కళలు అతి ప్రాచీనమైనవి. ఇవి మానవుల అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. అన్ని కళలకూ పునాదులై అగ్రభాగాన నిలిచాయి.

అనాదరణకు గురవుతున్న మన జానపదకళలను గుర్తించి, వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ నేపథ్యం

జనపదమంటే పల్లెటూరినీ, జనపదంలో నివసించేవారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గాని, ఆటలు గానీ, నృత్యం గానీ జానపద కళారూపాలనీ వ్యవహారం.

శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజాహృదయాలలో అలాగే నిలిచివున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ కన్న బిడ్డలుగా చూసుకున్నారు.

నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటివల్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించేవారు తగ్గిపోయారు.

ముఖ్యాంశం: జానపద కళలు అతి ప్రాచీనమైనవి. ఇవి మానవుల అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి.

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. మిక్కిలినేని తెలిపిన ఏవైనా మూడు జానపద కళలను వివరించండి.

పాఠ్యభాగ పరిచయం

‘జానపద కళలు’ పాఠ్యభాగం తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన “తెలుగువారి జానపద కళారూపాలు” అనే గ్రంథం నుండి గ్రహించబడినది.

పాఠ్యభాగ ఉద్దేశం

జానపద కళలు అతి ప్రాచీనమైనవి. ఇవి మానవుల అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి.

అనాదరణకు గురవుతున్న మన జానపదకళలను గుర్తించి, వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

జనపదం – జానపదులు – జానపద కళలు

జనపదమంటే పల్లెటూరు. జనపదంలో నివసించేవారు జానపదులు. వారు పాడుకునే పాటలుగానీ, ఆటలుగానీ, నృత్యాలుగానీ జానపద కళారూపాలు.

జానపద కళారూపాలలో నాటకరంగానికి, జానపద కళలకు కృషి చేసిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అనేక జానపద కళలను ప్రజలకు చేరువ చేశారు.

1. గంగిరెద్దుల మేళం

“గంగిరెద్దుల వాడు కావరమణచి ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు” అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచి గంగిరెద్దాటలు ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది.

గంగిరెద్దులవారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడతారు.

వీరికి ఒక ఊరనేది లేదు. పర్వదినాల్లోనూ, ముఖ్యంగా రైతులకు పంటలు చేతికి వచ్చే సంక్రాంతి పండుగ దినాలలోనూ వీధుల వెంట బయలుదేరతారు.

వయస్సులో ఉన్న కోడెగిత్తల్ని మాసాల పాటు మచ్చిక చేసుకుని వాద్యానికి అనుగుణంగా అడుగులు వేయించటం, పరుగెత్తించటం, పడుకోబెట్టడం, అటూ ఇటూ దొర్లించటం, చిట్టి అడుగులతో నృత్యం చేయించటం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల ఊపించటం వంటి ఎన్నో విద్యలు నేర్పి వీధుల్లోకి తీసుకువస్తారు.

గంగిరెద్దుల శరీరాన్ని రకరకాల బట్టలతో, కాళ్ళకు గజ్జెలతో చక్కగా అలంకరిస్తారు. గంగిరెద్దు మేళంలో డోలు, శ్రుతి, సన్నాయి బూర, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట ఉంటాయి. గంగిరెద్దులను బసవేశ్వరుడిగా పిలుస్తారు.

2. హరిహరీపదాలు

“హరి హరీ నారాయణ / ఆదినారాయణా / కరుణించి మమ్మేలు – కమలలోచనుడ!” అనే పల్లవితో సాగే పదాలను హరిహరీపదాలు అంటారు.

ఈ కళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో విశేష ప్రచారాన్ని కలిగి ఉంది. వీటిని జంపెలు అని కూడా అంటారు.

ఇవి కథాగేయాలు. సాధారణంగా రామాయణ, భారతాల నుండి స్వీకరించిన కథలే ఉంటాయి.

శివుని కీర్తించేవి, గంగాపరమేశ్వరుల వివాహం, సారంగధర చరిత్ర లాంటి కథాగానాలను వీరు ఆడిపాడతారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ప్రజాదరణ పొందిన ఈ హరిహరీపదాలను టేకుమళ్ళ కామేశ్వరరావుగారు సేకరించి ముద్రించారు.

పామరజనం పరంధాముణ్ణి సేవించడం కోసం కొందరు కవులు వీటిని రాశారు. పూరి రామచంద్రరాజు అనే కవి “కుశలాయకపదం”లో కఠినంబు కాంచితే, కాపులకు తెలియదని “మరుగులుంచుటమాని మాటలుంచితిని!” అని అన్నారు.

1856లో పసగాడ సన్యాసిరాజు రాసిన “గంగా వివాహపదం” మంచి రసవంతంగా ఉంటుంది. ఇందులో గంగా – గౌరీ సంవాదం కడుచమత్కారంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.

కలగర్ల వెంకటకామయ్య, మంథా సుబ్బారాయశాస్త్రి, పొడుగు రామబ్రహ్మ కవి, అయ్యగారి కూర్మనాథం, నడిమింటి రామయోగి, చంద్రగిరి తాతయ్య ఇంకా చాలామంది హరిహరీ పదాలను రచించి ప్రచారంలోకి తెచ్చారు.

3. బుట్టబొమ్మలు

బొమ్మలంటే ఇష్టపడనివారు, వాటితో ఆడుకోనివారు ఉండరు. నేడు వీటి ప్రదర్శన తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు పెండ్లి ఊరేగింపులలోను, దేవుని కళ్యాణోత్సవాలలోను, పెద్ద తిరునాళ్ళలోను, జాతరలలోను ఈ బుట్టబొమ్మల ప్రదర్శనలు తప్పనిసరిగా ఉండేవి.

పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కట్టా సూర్యనారాయణ ఈ బుట్టబొమ్మల తయారీలో సిద్ధహస్తుడు.

ఇతడి తండ్రి మల్లయ్య 1930వ సంవత్సరంలో మైసూరులో జరిగే దసరా వేడుకలు చూడడానికి వెళ్ళి అక్కడ బుట్టబొమ్మలాట చూచి ఆనందించి వాటి తయారీ విధానం నేర్చుకుని వచ్చాడు.

చింతగింజలను నానబెట్టి ఉడికించి గుజ్జు తయారు చేసేవారు. తమకు కావలసిన రీతిగా వెదురు తడికలతో, బద్దలతో బొమ్మ ఆకారం చేసుకునేవారు. దీనికి చింతపిక్కల గుజ్జు పూసి, అది ఆరిన తరువాత రంగులతో తీర్చిదిద్దేవారు.

నెలరోజులు పట్టే ఈ పద్ధతిలో స్త్రీ, పురుషుల బొమ్మలు చాలా అందంగా తయారుచేసేవారు.

ఈ బొమ్మలు లోపలి భాగమంతా డొల్లగా ఉండి, బొమ్మ కళ్ళ భాగంలో, నోటి దగ్గర రంధ్రాలు ఉంటాయి. ఈ బొమ్మలోపల దూరి నిలబడిన కళాకారుడు అభినయం చేస్తుంటే బొమ్మే ఆడుతున్నట్లు అనుభూతి కలిగేది.

దేవతామూర్తుల బొమ్మలతోపాటు శింగి, సింగడు లాంటి హాస్యపాత్రలు, పాములవాడి బొమ్మలు కూడా ఉండేవి. వాద్యగాళ్ళతో కలిసి పదిమంది బృందంగా ఏర్పడి బుట్టబొమ్మల కళారూపాన్ని రక్తికట్టిస్తారు.

ప్రదర్శనలు లేని సమయంలో ఈ బుట్టబొమ్మలకు గుడ్డలు చుట్టి చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు.

ప్రశ్న 2. ఉరుముల నృత్యం, హరిదాసులు గురించి వివరించండి.

ఉరుముల నృత్యం

అనేక జానపద కళారూపాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని అరుదుగా దర్శనమిస్తున్నాయి. అలాంటి వాటిలో “ఉరుముల నృత్యం” ముఖ్యమైనది.

తలకు రుమాళ్ళు చుట్టుకొని, మెడలో కాసుల దండలు ధరించి, ఎర్రనివీ పచ్చనివీ శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్లవేరుచెట్టు కర్రతో తయారుచేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదరపుల్లలతో వాయించుకుంటూ అమ్మవారి జాతరలలో ఉరుముల నృత్యం చేస్తూ ఉంటారు.

వాద్యధ్వని ఉరుమును పోలి ఉండడం వల్ల ఈ నృత్యానికి ఉరుముల నృత్యం అని పేరు పెట్టి ఉండవచ్చు.

హంపీ విజయనగరరాజుల కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చారు. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. ప్రస్తుతం కులవృత్తిని నమ్ముకుంటూ డెబ్బై కుటుంబాలదాకా అనంతపురం జిల్లాలో ఉన్నారు.

వీరిని ఉరుములోళ్ళు అని కూడా పిలుస్తారు. వీరు మాల కులానికి చెందినవారు. “ఉరుము” అనబడే చర్మవాద్యం అతిప్రాచీనమైనది.

ఆదిమజాతుల నర్తనరూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర శబ్దాలను సృష్టించేవారు. వీరుచేసే నాట్యం అతి గంభీరమైనది.

ఉరుములు వాద్యం ఒకేసారి ఏకధాటిగా వాయిస్తే కారుమెయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. అందుకే ఈ వాద్యానికి “ఉరుము” అని పేరుపెట్టి ఉండవచ్చు.

ఒకచేత వీరణం యొక్క చర్మాన్ని పేముపుల్లతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరోచేత పుల్లతో లయ విన్యాసాలు తాళయుక్తంగా సాగుతాయి.

వీరి ఆరాధ్య దైవం శ్రీశైలమల్లన్న. ఆయన మహాత్మ్యగాథలను ఉరుములపై దరువులు వేస్తూ గానం చేస్తారు.

హరిదాసులు

తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. కష్టజీవులైన రైతు సోదరులు పంటసిరిని ఇంటికి తెచ్చుకుని ఆనందంతో చేసుకునే పండుగ ఇది.

ధనుర్మాసం నెలరోజులు తెలుగు లోగిళ్ళు పేడ కళ్ళాపులు, ముగ్గులు, గొబ్బెమ్మలతో శోభాయమానంగా ఉంటాయి. ఇళ్ళు చక్కగా అలికి, గోడలకు సున్నాలు కొడతారు.

ఈ తరుణంలో హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ, భక్తి పాటలు పాడతారు.

కాషాయం లేదా పసుపురంగు వస్త్రాలు ధరించి నుదుటన తిరునామం దిద్దుకొని మెడలో తులసిమాలలు, చేతిలో చిడతలు, భుజం మీద తంబుర, తలమీద అక్షయపాత్ర ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని “హరిలో రంగహరి”, “శ్రీమద్రమారమణ గోవింద హరి” అంటూ ప్రతి ఇంటికీ వస్తారు.

వారిచ్చే బియ్యం, కానుకలు స్వీకరిస్తారు. “అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, ఏ తీరుగ నను దయచూచెదవో – ఇనవంశోత్తమ రామా!”, “పలుకే బంగారమాయెనా – కోదండపాణి!” వంటి రామదాసుగారి కీర్తనలు పాడుతూ గ్రామమంతా తిరుగుతారు.

ప్రతి సంవత్సరం ఏ ఊరుకు ఎవరెవరు వంతుగా వస్తారో వారు తప్ప ఇతరులు రారు. దాసరులు సాతాని వైష్ణవులు.

వంశపారంపర్యంగా ఈ హరిదాసుల రూపంలో యాచనచేసి ప్రజలిచ్చే బియ్యం పుచ్చుకొని వారిని పుత్రపౌత్రులతో వర్ధిల్లాలని దీవిస్తూ ఉంటారు. హరిదాసుల అక్షయపాత్రల్లో బియ్యం వెయ్యడానికి పిల్లలు, పెద్దలు పోటీపడతారు.

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. మిక్కిలినేని జీవిత విశేషాలను తెలపండి.

తెలుగు రంగస్థల మరియు చలనచిత్ర నటులు, రచయిత, పరిశోధకులు, స్వాతంత్ర్య సమరయోధులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 07-7-1916వ తేదీన సౌభాగ్యమ్మ, వెంకయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను వరసగా కృష్ణాజిల్లాలోని కోలవెన్నులోనూ, పునాదిపాడులోనూ అభ్యసించారు.

మిక్కిలినేని జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని ఐదుసార్లు జైలుశిక్ష అనుభవించారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

దీనిద్వారా బుర్రకథ, హరికథ, జముకుల కథ, వీధినాటకం, కోలాటం, బృంద నృత్యం మొదలైన కళారూప ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఆంధ్ర నాటక రంగ చరిత్ర, నటరత్నాలు, తెలుగువారి జానపద కళారూపాలు, ప్రజాపోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్యకళా వికాసం, తెలుగువారి చలనచిత్రకళ మొదలైన గ్రంథాలను రచించారు.

“నటరత్నాలు” గ్రంథానికి ఆంధ్రదేశ సాహిత్య అకాడమి అవార్డు లభించింది.

ప్రశ్న 2. జట్టి జాము గురించి రాయండి.

జట్టి జాము తాళ ప్రధాన కళ. ఇది ఆంధ్రదేశంలో రాయలసీమలో మాత్రమే కనిపించే కళారూపం. దీనిలో చేతులు చరచటం, అంటే చప్పట్లు లాంటివి ఉంటాయి.

నిటారుగా నిలబడి ఉభయపార్శ్వాల్లో ఒకసారి కుడిపక్కకు, ఒకసారి ఎడమపక్కకూ, పార్శ్వముఖ భంగిమలో ఓరగా తిరిగి, ఆయా వైపుల ఉండే వారి అరచేతుల్ని తన చేతులతో తడుతూ పాడుతూ ఈ ఆటను ప్రదర్శిస్తారు.

కాలు కదపకుండానే ఉన్న చోటే జట్టిజాము వేయవచ్చు. జట్టి జాము పూర్తిగా స్త్రీల ఆట. నలుగురు కానీ, అంతకు ఎక్కువైతే సరి సంఖ్యలలో గానీ పాల్గొంటారు.

వీరు రెండు జట్లుగా ఉంటారు. ఒక జట్టువారు పాటలో ఒక పాదాన్ని పాడితే రెండవ జట్టువారు వంత పాడతారు.

“తుమ్మెదా, నడియలో రామరామా కోదండ రామా” వంటి పల్లవులు జట్టిజాము పాటల్లో వినిపిస్తాయి.

ప్రశ్న 3. ఘటంచిందు గురించి వివరించండి.

ఆదిపరాశక్తిని మన గ్రామీణులు రకరకాల పేర్లతో ఊరూరా నిలుపుకొని కొలుచుకుంటున్నారు. వారికి జాతరలు, కొలుపులు జరిపేటప్పుడు అనాదిగా ఈ ఘటంచిందు చేసేవారు.

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకప్పుడు విరివిగా ఈ నృత్యం (చిందు) చేయబడేది. దానికెలాంటి శాస్త్రీయతా లేదు.

గ్రామానికి చెందిన రజకులు ఈ ఘటాన్ని ఎత్తుకుని డప్పుల మోతలకు అనుగుణంగా లయబద్ధంగా చిందులు వేస్తారు.

పల్లెటూర్లలో పశువులకు జాడ్యాలు వచ్చినప్పుడు, మనుషులకు కలరా, మశూచి వ్యాపించినప్పుడు గ్రామం మధ్యలో తాటాకు పందిరివేసి అందులో గ్రామ దేవతలను నిలుపుతారు.

పంబలవారు, సన్నాయి, డోలు, కనక తప్పెట్లతో హోరెత్తిస్తూ ఉండగా ఘటాన్ని ఎత్తుకున్న వ్యక్తి ఉద్రేకంగా వీరంగమాడతాడు.

ఈ ఘటానికి నిండా పసుపురాసి బొట్లు పెడతారు. వేపాకు తోరణం చుడతారు. ఘటం ఇంటింటికీ తిరుగుతుంది. అందులో అందరూ మజ్జిగ, అన్నం వేసేవారు.

దేవతల ప్రీతికోసం సేకరించిన ఈ మజ్జిగ అన్నాన్ని ప్రసాదంగా వాద్యకారులు, రజకులు పంచుకు తినేవారు.

ఎంతో భక్తితో, నమ్మకంతో చేసే ఈ ఘటనృత్యంలో ఉపయోగించే కుండను సాధారణంగా మట్టితోనో, కంచుతోనో తయారుచేసేవారు.

III. ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న జవాబు
1. “గంగిరెద్దుల మేళం” గురించి శ్రీనాథుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? ‘గంగిరెద్దుల మేళం’ గురించి శ్రీనాథుడు ‘పలనాటి వీర చరిత్ర’లో పేర్కొన్నాడు.
2. హరిదాసులు ప్రధానంగా ఏ పర్వదినాలలో కన్పిస్తారు? హరిదాసులు ప్రధానంగా తెలుగువారి పెద్ద పండగ ‘సంక్రాంతి’ పర్వదినాలలో కనిపిస్తారు.
3. “బుట్టబొమ్మలు” కళను ఆంధ్రదేశానికి పరిచయం చేసినవారెవరు? బుట్టబొమ్మలు కళను ఆంధ్రదేశానికి పరిచయం చేసినవారు కట్టామల్లయ్య.
4. హరిహరీ పదాలకు మారు పేరేమిటి? హరిహరీ పదాలకు మారు పేరు “జంపెలు”.
5. “జానపదులు” అంటే ఎవరు? జనపదంలో నివసించే వారిని జానపదులు అంటారు.

విశేషాంశాలు

మాన్యం

కళాకారుల నైపుణ్యానికి మెచ్చి మహారాజులు, దాతలు కొంత భూమిని పన్నులు మినహాయించి బహుమతిగా ఇచ్చే భూమి.

సాతాని వైష్ణవులు

చాత్తాద శాత్తాద శ్రీ వైష్ణవ శాఖవారిని తెలుగునాట సాతానివారని, సాతాని వైష్ణవులని పిలుస్తారు.

పంబలవారు

పంబ అనేది ఒక వాద్య విశేషం. దీనిని మోగిస్తూ గ్రామ దేవతల కొలుపులు చేసేవారిని పంబలవారు అంటారు.

గ్రామదేవతల పుట్టుక కథలను వీరు లయబద్ధంగా ఆలపిస్తారు.

అదనపు సమాచారం

జాతీయం – కత్తిమీద సాము

నేలమీద సాము చేయాలంటేనే ఆరోగ్యం, బలం, నేర్పు కావాలి. కానీ కత్తి అంచున నిలిచి సాము చేయటం మాటలతో పనికాదు. అలా చేసిన వాళ్లున్నారో లేదో తెలియదు.

తాళ్లమీద, తీగల మీద నడిచే వాళ్ళున్నారు, కత్తులలాంటి మేకులున్న బల్లమీద పడుకొని బరువు లెత్తించుకొని బతికిన వాళ్లున్నారు.

కానీ విచ్చుకత్తి మొనమీద నిలిచి సాము చేసినవాళ్లు ఉన్నట్లు దాఖలా లేదు. అయినా, అదో మహత్తర విద్య. అదెంత భయంకరమో మన ఊహకే అందుతుంది.

కళ్ళారా చూస్తేగాని నమ్మవలసిన విషయం కాదది. అత్యంత ప్రమాదకరమూ, అసాధ్యమూ అని చెప్పడానికి “ఫలానా పని కత్తిమీద సాములాంటిది” అంటుంటారు.

ఉదాహరణ: సియాచిన్ సరిహద్దు ప్రాంతంలో పహారా కాయడం కత్తిమీద సాము లాంటిది.

జానపద కళలు – Summary in Telugu

పాఠ్యభాగ సంగ్రహణ

‘జానపద కళలు’ పాఠ్యభాగం తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన “తెలుగువారి జానపద కళారూపాలు” అనే గ్రంథం నుండి గ్రహించబడినది.

జనపదం

జనపదమంటే పల్లెటూరినీ, జనపదంలో నివసించేవారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గాని, ఆటలు గానీ, నృత్యం గానీ జానపద కళారూపాలనీ వ్యవహారం.

శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజాహృదయాలలో అలాగే నిలిచివున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ కన్న బిడ్డలుగా చూసుకున్నారు.

నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటివల్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించేవారు తగ్గిపోయారు.

జానపద కళలు అతి ప్రాచీనమైనవి. ఇవి మానవుల అనుభూతులకూ, మానసిక చైతన్యానికీ, విజ్ఞాన వినోదాలకూ, ఆనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. అన్ని కళలకూ పునాదులై అగ్రభాగాన నిలిచాయి.

అనాదరణకు గురవుతున్న మన జానపదకళలను గుర్తించి, వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

ముఖ్యమైన జానపద కళారూపాలు – Quick View

గంగిరెద్దుల మేళం

సంక్రాంతి వంటి పర్వదినాల్లో వీధుల్లో ప్రదర్శిస్తారు. గంగిరెద్దులను బసవేశ్వరుడిగా పిలుస్తారు.

హరిహరీపదాలు

కథాగేయాలు. వీటిని జంపెలు అని కూడా అంటారు. ఉత్తరాంధ్రలో విశేష ప్రజాదరణ పొందాయి.

బుట్టబొమ్మలు

పెండ్లి ఊరేగింపులు, కళ్యాణోత్సవాలు, తిరునాళ్ళు, జాతరలలో ప్రదర్శించేవారు.

ఉరుముల నృత్యం

ఉరుము అనే చర్మవాద్యాన్ని ఉపయోగించే గంభీరమైన జానపద నృత్యం.

హరిదాసులు

సంక్రాంతి సమయంలో ఇంటింటికీ తిరుగుతూ భక్తి పాటలు పాడుతారు.

జట్టి జాము

రాయలసీమలో కనిపించే తాళ ప్రధానమైన స్త్రీల కళారూపం.

ఘటంచిందు

గ్రామదేవతల జాతరలు, కొలుపుల సమయంలో చేసే నృత్యరూపం.

Quick Revision

జనపదం

పల్లెటూరు

జానపదులు

జనపదంలో నివసించేవారు

జానపద కళలు

పాటలు, ఆటలు, నృత్యాలు మొదలైనవి

గంగిరెద్దుల మేళం

పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు పేర్కొన్నారు

హరిహరీ పదాలు

జంపెలు

హరిదాసులు

సంక్రాంతి పర్వదినాల్లో కనిపిస్తారు

ఉరుముల నృత్యం

ఉరుములోళ్ళు చేస్తారు

జట్టి జాము

రాయలసీమలో కనిపించే స్త్రీల ఆట

బుట్టబొమ్మలు

కట్టామల్లయ్య – మూల నోట్స్ ప్రకారం

ఘటంచిందు

గ్రామదేవతల కొలుపులతో సంబంధం

మిక్కిలినేని జననం

07-07-1916

మిక్కిలినేని మరణం

22-02-2011

పరీక్షకు ముఖ్యమైన ప్రశ్నలు

  1. మిక్కిలినేని తెలిపిన ఏవైనా మూడు జానపద కళలను వివరించండి.
  2. ఉరుముల నృత్యం, హరిదాసులు గురించి వివరించండి.
  3. మిక్కిలినేని జీవిత విశేషాలను తెలపండి.
  4. జట్టి జాము గురించి రాయండి.
  5. ఘటంచిందు గురించి వివరించండి.
  6. “గంగిరెద్దుల మేళం” గురించి శ్రీనాథుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు?
  7. హరిదాసులు ప్రధానంగా ఏ పర్వదినాలలో కన్పిస్తారు?
  8. “బుట్టబొమ్మలు” కళను ఆంధ్రదేశానికి పరిచయం చేసినవారెవరు?
  9. హరిహరీ పదాలకు మారు పేరేమిటి?
  10. “జానపదులు” అంటే ఎవరు?
  11. మాన్యం అంటే ఏమిటి?
  12. సాతాని వైష్ణవులు అంటే ఎవరు?
  13. పంబలవారు అంటే ఎవరు?
  14. “కత్తిమీద సాము” జాతీయాన్ని వివరించండి.

జానపద కళలు – Inter 1st Year Telugu

Questions • Answers • Summary • జానపద కళారూపాలు • Quick Revision

Leave a Reply

Discover more from Interactive English

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading